Omicron..mask must : విజృంభిస్తున్న ఒమిక్రాన్..ఎటువంటి మాస్క్ ధరించాలి?
ఒమిక్రాన్ ను నిరోధించాలంటే ఎటువంటి మాస్కులు ధరించాలి? క్లాత్ మాస్కులు వాడవచ్చా? లేయర్ మాస్క్ లు సరిపోతాయా? అని ఎన్నో అనుమానాలు. దీంతో మరోసారి మాస్కులపై చర్చ ప్రారంభమైంది..

Mask Good Enough To Stop Omicron Attack
Omicron..mask must : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో పోల్చితే ఈ కొత్త వేరియంట్ జెట్ స్పీడ్ తో వ్యాపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ లు ప్రజల్ని వణికిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోంది. దీంతో మాస్క్ మస్ట్ గా మారింది. ఈ కరోనా కట్టడికి మాస్క్ దరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, టీకాలు వేసుకోవడం తప్పని సరి అని ప్రభుత్వాలు పదే పదే సూచిస్తున్నాయి. ప్రపంచాన్ని ఒమిక్రాన్ చుట్టేస్తున్న క్రమంలో ఎటువంటి మాస్కులు ధరించాలి..ఒమిక్రాన్ ను నిరోధించాలంటే ఎటువంటి మాస్కులు ధరించాలి? క్లాత్ మాస్కులు వాడవచ్చా? లేయర్ మాస్క్ లు సరిపోతాయా? అని ఎన్నో అనుమానాలు. దీంతో మరోసారి మాస్కులపై చర్చ ప్రారంభమైంది..
క్లాత్ మాస్కులు రక రకాల వస్త్రంలో తయారు చేస్తారు. చూడడానికి ఎంతో కలర్ ఫుల్ గా..అందంగా మ్యాచింగ్ గా కూడా ధరించవచ్చు. కానీ ఇవి కరోనా కట్టడి చేస్తాయని నూటికి నూరు శాతం చెప్పలేం అని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ క్లాత్ తో తయారు చేసిన మాస్కులు రక్షణనివ్వవని చెబుతున్నారు. చాలా మంది రీయూజబుల్ క్లాత్ మాస్కులు ధరిస్తున్నారు. వాటినే మళ్లీ ఉతుక్కొని వేసుకుంటున్నారని.. అలాంటి వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఎటువంటి మాస్కులు ధరించాలి? అనేదానిపై కూడా పలు సూచనలు చేశారు. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగిస్తున్నా..లేదా ఆఫీస్ వంటి మూసివున్న ప్రదేశంలో పనిచేస్తున్నా.. సర్జికల్ మాస్క్ కంటే మెరుగైనది ధరించాలని సూచించారు.ఒమిక్రాన్ విజృంభణ వేళ క్లాత్ మాస్క్ లు అంత రక్షణ కాదని ఆక్స్ ఫర్డ్ వైద్యనిపుణులు వెల్లడించారు. N 95 మాస్కులు అయితే మిక్స్ డ్ మెటిరియల్ తో తయారు చేసే డుబుల్, ట్రిపుల్ లేయర్ మాస్క్ లు వైరస్ కట్టడికి సమర్ధవంతంగా పనిచేస్తాయని తెలిపారు. N 95 లాంటి మాస్కులు 95 శాతం క్రిములు, వైరస్ లను అడ్డుకునేలా తయారు చేస్తారని తెలిపారు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఎన్- 95 మాస్కులను ధరించమని సూచిస్తుంటారని అన్నారు.
మాస్కులతో ముక్కు, నోరును మొత్తం కవర్ చేయాలి.. ముఖానికి మాస్కు ధరించినప్పుడు ఫిల్డరేషన్ జరగాలని..మాస్క్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా సులువుగా శ్వాస పీల్చుకునేలా ఉండాలని సూచించారు. సింగిల్ లేయర్ మాస్కులు ఒమిక్రాన్ వైరస్ ను అరికట్టలేవని..ట్రిపుల్ లేయర్ మాస్క్ లను వాడడం మంచిదని సూచించారు.