Gram Panchayat Elections
Local Body Elections: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందితో పాటు రూట్ మొబైల్ టీమ్స్, రూట్ ఇన్‌చార్జీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు పనిచేస్తున్నాయి.
పురుష ఓటర్లు మొత్తం 26,01,861 మంది, మహిళా ఓటర్లు 27,04,394 మంది, ఇతరులు 140 మంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది పోటీ పడుతుండగా, 28,410 వార్డులకు 75,725 మంది ఇవాళ పోటీపడుతున్నారు.
Pawan Kalyan : ఆ బాధ్యత మీదే అన్న సీఎం చంద్రబాబు.. నిమిషాల్లో పని పూర్తిచేసిన డిప్యూటీ సీఎం పవన్..
మంగళవారం సాయంత్రంలోగా పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మూడో దశ ఎన్నికలు 182 మండలాల్లో జరుగుతున్నాయి. 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి.