Hyderabad : వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం, కళ్లకు గంతలు కట్టి దారుణం

దెయ్యం పట్టింది అంటూ తనను ఇంట్లోనే బంధించారని వాపోయింది. Hyderabad - Fake Baba

Hyderabad - Fake Baba

Hyderabad – Fake Baba : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని బండ్లగూడలోని ఓ బాబా దగ్గరికి అత్తమామలు తీసుకెళ్లారు.

నవవధువు కళ్లకు గంతలు కట్టిన బాబా గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో పరారయ్యాడు. దీని గురించి అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది. దెయ్యం పట్టింది అంటూ తనను ఇంట్లోనే బంధించారని వాపోయింది. అనంతరం తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది బాధితురాలు.

Also Read..Husband Kills Wife : వీడెవడండీ బాబూ.. భార్య నల్లగా ఉందని దారుణం, కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన భర్త

అయితే, ఘటన బండ్లగూడ పరిధిలో జరిగింది అంటూ భవానీనగర్ పోలీసులు వారిని అక్కడికి పంపేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

కొందరు కేటుగాళ్లు బాబాలుగా అవతారం ఎత్తుతున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. జనం అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, మూఢనమ్మకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు పూజల పేరుతో డబ్బు లాగుతున్నారు. మరికొందరు వైద్యం పేరుతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మాటలతో మాయ చేసి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. దొంగ, నకిలీ బాబాల వ్యవహారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

Also Read..Jagtial Mystery : జగిత్యాలలో కలకలం.. అక్క అనుమానాస్పద మృతి, చెల్లి అదృశ్యం.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

దొంగ బాబాలను నమ్ముకుని అడ్డంగా మోసపోతున్నారు. ఇలాంటి దొంగ, నకిలీ బాబాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. వాళ్లసలు బాబాలు కాదు కంత్రీగాళ్లు.. బాబాల వేషంలో మోసాలు చేస్తున్నారని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరు వినిపించుకోవడం లేదు.