ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్..ఇద్దరి అరెస్టు

  • Publish Date - November 28, 2020 / 08:53 PM IST

Fake Dharani mobile app : ధరణి నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక బసవకళ్యాణ్ గ్రామానికి చెందిన మహేశ్, ప్రేమ్ ధరణి నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు టీఎస్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.



ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.