Farmer Dies
Farmer Dies : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ తో పొలం దున్నతుండగా అది అదుపు తప్పి డ్రైవర్ తో సహా వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో రైతు మృతి చెందాడు. దీని గురించి సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు. వ్యవసాయ బావిలో పడిన ట్రాక్టర్ ను బయటకు తీశారు. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు. రైతు మృతదేహాన్ని కూడా బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన శంకరయ్యకు ఇటీవల దళితబంధు రావడంతో ట్రాక్టర్ కొన్నాడు. అదే గ్రామానికి చెందిన మల్లేశ్ సాయంతో ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. గురువారం మల్లేశ్ తో కలిసి పొలం దున్నేందుకు శంకరయ్య తన ట్రాక్టర్ తో వెళ్లాడు. పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
Student Dead: ఆడుకుంటుండగా చెట్టు కూలి విద్యార్థిని మృతి
డ్రైవింగ్ సీటులో ఉన్న శంకరయ్య ట్రాక్టర్ తో పాటు నీటిలో మునిగిపోగా పక్కనే కూర్చున్న మల్లేశ్ బావి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో స్పాట్ కి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. స్థానికులు, జేసీబీ సాయంతో ఎట్టకేలకు ట్రాక్టర్ ను బయటకు తీశారు. ఈ క్రమంలో ట్రాక్టర్ నుంచి శంకరయ్య మృతదేహం బావిలో పడిపోయింది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.