Student Dead: ఆడుకుంటుండగా చెట్టు కూలి విద్యార్థిని మృతి

ఈ ఘటన ఛండీఘడ్‌లోని సెక్టార్ 9 పరిధిలో గల క్యార్మెల్ గల్స్ కాన్వెంట్ స్కూల్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. స్కూల్ ఆవరణలోనే చాలా ఏళ్లనాటి రావి చెట్టు ఉంది. ఇది 250 ఏళ్ల నాటి చెట్టు. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది.

Student Dead: ఆడుకుంటుండగా చెట్టు కూలి విద్యార్థిని మృతి

Student Dead: పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా చెట్టు కూలి ఒక విద్యార్థిని మరణించింది. మరో 14 మంది విద్యార్థినులు గాయపడ్డారు. ఈ ఘటన ఛండీఘడ్‌లోని సెక్టార్ 9 పరిధిలో గల క్యార్మెల్ గల్స్ కాన్వెంట్ స్కూల్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. స్కూల్ ఆవరణలోనే చాలా ఏళ్లనాటి రావి చెట్టు ఉంది. ఇది 250 ఏళ్ల నాటి చెట్టు. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని ఛండీఘడ్‌ అడ్మినిస్ట్రేషన్ హెరిటేజ్ ట్రీగా గుర్తించింది. ఉదయం కొంతమంది బాలికలు స్కూల్ ఆవరణలోఆడుకుంటున్నారు. ఈ సమయంలో కొందరు విద్యార్థులు చెట్టు కింద ఆడుకుంటున్న సమయంలో చెట్టు ఒకవైపు కొంత భాగం ఉన్నట్టుండి కూలిపోయింది.

Dr K Laxman: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డా.కె.లక్ష్మణ్

భారీ పరిమాణంలో ఉన్న చెట్టు మీద పడిపోవడంతో ఒక విద్యార్థిని మరణించింది. మరో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పాఠశాల ఆవరణను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.