Farmers Filed Petition In High Court To Cancel Cm Kcr Meeting In Sagar
Farmers filed petition in High court: కేసీఆర్ సభపై నీలి నీడలు అలుముకున్నాయి. నాగార్జున సాగర్‌లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చేయాలంటూ రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈనెల 14న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. సాగర్‌లో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సభను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. సీఎం సభకు అనుమతి ఇవ్వొద్దని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు.
తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. అత్యవసర అనుమతికి హైకోర్టు నిరాకరించింది. మరోసారి చీఫ్ జస్టిస్ బెంజ్ దగ్గర రైతులు పిటిషన్ వేశారు. హౌస్ మోషన్ కు అనుమతిపై రైతులు ఎదురుచూస్తున్నారు.