Jayashankar Bhupalpally
Jayashankar Bhupalpally: భూతగాదాలో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కాటారం మండలం గంగారాం గ్రామంలో పొలం దగ్గర రైతుల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం ప్రత్యర్థులు తండ్రి, ఇద్దరు కొడుకులను గొడ్డళ్లతో నరికి హత్య చేశారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతులు లావుడ్యా మంజు నాయక్ (తండ్రి) లావుడ్యా సారయ్య (పెద్ద కుమారుడు), లావుడ్యా భాస్కర్ (చిన్న కుమారుడు). ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.