Murder
father kill son : వికారాబాద్ లో దారుణ జరిగింది. కన్న కొడుకునే కడతేర్చాడో తండ్రి. కొడుకు జులాయిగా తిరుగుతుండటం, మద్యం తాగొచ్చి నిత్యం ఘర్షణకు దిగుతుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి.. కొడుకుపై కత్తితో దాడి చేశాడు. నిద్రిస్తుండగా తలపై నరకడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
రమేష్, రవి తండ్రీకొడుకులు. గతంలో తండ్రీకొడులకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోవాలని హెచ్చరించినా.. కొడుకు మారకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.