Female loco pilot missing
Female loco pilot missing : హైదరాబాద్ లో ఓ మహిళా లోకో పైలట్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని సనత్ నగర్ లో అద్దె ఇంట్లో నివసిస్తున్న మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30వ తేదీన సాయంత్రం మహిళా లోకో పైలట్ అదృశ్యమైంది.
రోజు లాగే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ కాల్ చేశారు. అయితే ఫోన్ కాల్ ను ఎంతసేపటికీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటి యజమానికి ఫోన్ చేశారు. సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్తున్నానని మహిళ వెళ్లిపోయారని ఇంటి ఓనర్ ఆమె తండ్రికి చెప్పారు.
Hyderabad : యువతి అదృశ్యం.. స్నేహితులను కలిసేందుకు వెళ్లి.. తిరిగి ఇంటికి రాలేదు
తండ్రికి అనుమానం రావడంతో ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటలకు ఇంటి తలుపులు తెరిచి చూడగా ఆమె గదిలో లేదు. కానీ ఫోన్ రూమ్ లోనే ఉంది. దీంతో తండ్రి భాస్కర్ రావు కూతురు అదృశ్యమైనట్లు భావించి సనత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదృశ్యమైన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలరని తెలిపారు. ఎవరికైనా ఆమె కనిపిస్తే సనత్ నగర్ ఎస్ హెచ్ వో 9490617132, ఎస్ఐ 8919558998 మొబైల్ ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.