Fire Accident At BJP Office : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీతో.. బీజేపీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించింది. బాణాసంచా నిప్పురవ్వలు పడి బీజేపీ ఫ్లెక్సీలు, కరెంటు వైర్లు దగ్గమయ్యాయి. ఎండుటాకులు, కట్టెలు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు, శ్రేణులు.. మంటలను ఆర్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గుజరాత్ లో బీజేపీ ఘన విజయంతో.. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. క్రాకర్స్ కాల్చగా నిప్పురవ్వలు వెళ్లి ఫ్లెక్సీ మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఎండిన ఆకులపై నిప్పురవ్వలు పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు బీజేపీ కార్యకర్తలు చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.