Fire Broke Out : సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. లిఫ్ట్ లో నుంచి ఉద్యోగులు సేఫ్ గా బయటకు వచ్చారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

Ghmc

GHMC office in Secunderabad : సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బుధవారం (జనవరి12, 2022) స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మూడో అంతస్తులోని ఇన్ కమ్ ట్యాక్స్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. మంటల కారణంగా భారీగా పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేశారు.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. లిఫ్ట్ లో నుంచి ఉద్యోగులు సేఫ్ గా బయటకు వచ్చారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే పెను ప్రమాదం సంభవించివుండేదని ఉద్యోగులు అంటున్నారు.

Omicron Symptoms : మీరు ఒమిక్రాన్ బారిన పడ్డారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..!

ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ బ్లాక్ లో చెలరేగిన మంటలకు కొన్ని ఫైళ్లు దగ్ధం అయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారాణాలు తెలియలేదు.