Omicron Symptoms : మీరు ఒమిక్రాన్ బారిన పడ్డారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..!

రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

Omicron Symptoms : మీరు ఒమిక్రాన్ బారిన పడ్డారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..!

Omicron Symptoms How Do You Know You Are Infected With The Omicron Virus, Follow These Steps

Omicron Symptoms : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని పలు నివేదికల్లో వెల్లడైంది. ఒమిక్రాన్ బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో ఒళ్లు నొప్పులు, సాధారణ బలహీనత, అలసట, తలనొప్పి, జ్వరంతో లక్షణాలు ప్రారంభమవుతాయి. మెల్లగా దగ్గు మొదలవుతుంది. ఆ తర్వాత జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములతో పాటు కొన్నిసార్లు ముక్కు నాశికరంద్రాలు ఎండిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒమిక్రాన్ సోకినవారిలో సాధారణంగా పొడి దగ్గు వస్తుంటుంది. వైరస్ సోకిన కొద్ది రోజుల్లోనే ఈ లక్షణాలు తగ్గిపోతాయి. 80శాతం మంది బాధితుల్లో మొదటి మూడు రోజుల్లోనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గినా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే వైద్యుల నిరంతర పర్యవేక్షణ అవసరమని డాక్టర్ సోనమ్ సోలంకి చెప్పారు. ఒమిక్రాన్ బారినపడి వ్యక్తి సరైన సమయంలో ఐసోలేషన్ లో ఉండటం వల్ల మీ నుంచి ఇతర కుటుంబ సభ్యులకు సంక్రమించకుండా నివారించే అవకాశం ఉంటుంది. అనుమానం వస్తే.. వెంటనే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకోవాలి.

అందులో నెగటివ్ వచ్చినా కూడా మరోసారి RT-PCR టెస్టు కూడా చేయించుకోవడం ద్వారా కచ్చితమైన నిర్ధారణ చేసుకోవచ్చు మీరు జాగ్రత్తపడటంతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా అలర్ట్ చేసేందుకు వీలుంటుంది. అప్పుడు మీ నుంచి ఎక్కువ మందికి ఒమిక్రాన్ వ్యాపించకుండా నివారించే అవకాశం ఉంటుంది. యటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు సరిగ్గా ధరించాలి. మీలో వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు.. N95 మాస్క్‌ వెంట ఉండాల్సిందే.. తప్పకుండా ధరించాల్సిందేనని డాక్టర్ సూచించారు.

ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ఇతర మ్యుటేషన్ల కన్నా చాలా వేగంగా వ్యాపించగలదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆస్పత్రుల్లో అధిక ప్రమాదం ఉన్న ప్రదేశాలలో సరిగ్గా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. వైద్య సదుపాయాలు చాలా ముఖ్యమైనవి.. మీకు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే N95 మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు. ఏ కారణం చేతనైనా బయటికి రావాల్సి వస్తే.. మీల్లో రోగలక్షణాలు దగ్గుతో ఉంటే సాధారణ వస్త్రం లేదా సర్జికల్ మాస్క్ సరిపోదని డాక్టర్ సోనమ్ సూచించారు. భారతదేశంలో వరుసగా మూడవ రోజు 1.5 లక్షలకు పైగా కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కోవిడ్ ప్రీకాషన్ టీకాను పొందదడం ద్వారా ఒమిక్రాన్ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు.

Read Also : SC Notice To Uttarakhand : హ‌రిద్వార్‌లో హిందూ నేత‌లు వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు..ఉత్త‌రాఖండ్‌కు సుప్రీం నోటీసులు