SC Notice To Uttarakhand : హ‌రిద్వార్‌లో హిందూ నేత‌లు వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు..ఉత్త‌రాఖండ్‌కు సుప్రీం నోటీసులు

హ‌రిద్వార్‌లో హిందూ నేత‌లు వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు చేసినందుకు సుప్రీంకోర్టు ఉత్త‌రాఖండ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

SC Notice To Uttarakhand : హ‌రిద్వార్‌లో హిందూ నేత‌లు వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు..ఉత్త‌రాఖండ్‌కు సుప్రీం నోటీసులు

Sc Notice To Uttarakhand (1)

Supreme Court issues notice to Uttarakhand govt : ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హ‌రిద్వార్‌లో జ‌రిగిన ధ‌ర్మ సంస‌ద్ స‌మావేశంలో హిందూ నేతలు విద్వేష ప్ర‌సంగాలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగిన సందర్భంగా ధర్మాసనం ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. హ‌రిద్వార్‌లో 2020 డిసెంబర్ లో జ‌రిగిన ధ‌ర్మ సంస‌ద్ కార్య‌క్ర‌మంలో హిందూ నేత‌లు ముస్లింలను టార్గెట్ గా చేసుకుని పనిచేయాలంటూ వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రేకెత్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.

Read more : Sri Lanka :కిలో పచ్చిమిర్చి రూ.710, కిలో ఆలూ రూ. 200

ఈ కేసులో దాఖ‌లైన పిటిష‌న్‌ను గురువారం (జనవరి 12,2022) సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, సూర్య కాంత్‌, హిమా కోహ్లీతో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ వాదించారు. ధ‌ర్మ సంస‌ద్ కార్య‌క్ర‌మాల‌ను రెగ్యుల‌ర్‌గా నిర్వ‌హిస్తున్నార‌న్నారు. జ‌న‌వ‌రి 24వ తేదీన అలీఘ‌డ్‌లో ఇలాంటి స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

‘హిందూ యువ వాహిని’ పేరుతో హరిద్వార్‌లో యతి నర్సింహానంద్, మరొకటి ఢిల్లీలో నిర్వహించారు. హరిద్వార్‌లోని ధర్మ సంసద్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. ఈ సమావేశంలో వక్తలు ఒక సామాజిక వర్గానికి చెందినవారిని మారణహోమం చేయాలని పిలుపునిచ్చారు.

Read more : Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్

ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సంత్ ధర్మదాస్ మహారాజ్, సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా శకున్ పాండే, వసీం రిజ్వీ అకా జితేంద్ర త్యాగి,ధర్మ సంసద్‌తో సంబంధం ఉన్న మరికొందరిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు యతి నర్సింహానంద్, సాగర్ సింధు మహరాజ్ పేర్లను చేర్చారు. ఈకేసు సుప్రీంకోర్టుకు వెళ్లటంతో ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.