హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతీయేటా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది.

Fish Prasadam

Fish Prasadam Distribution: మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతీయేటా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. గత 178ఏళ్లుగా బత్తిన కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తేదీలను కూడా ప్రకటించారు.

ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. భారీ సంఖ్యలో ప్రజలు చేప ప్రసాదం స్వీకరించేందుకు వస్తుంటారు. ఈసారి వచ్చే నెలలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు.

జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ఏర్పాట్లపై 21శాఖల అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సమీక్ష నిర్వహించారు. నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎన్జీవోలు ఇతర శాఖల అధికారులతో చర్చించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు.