Telangana : రోజుకు ఐదు లక్షల పారాసెటమాల్‌ మింగేస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Paracetamol

Paracetamol : రోజుకు ఐదు లక్షల పారాసెటమాల్ మందులను మింగేస్తున్నారు జనాలు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పారాసెటమాల్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. సాధారణంగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు పారాసెటమాల్ వాడుతుంటారు. అయితే..కరోనా కారణంగా వీటి వినియోగం ఎక్కువ అయినట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్ వైరస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని భావించే…ఈ మందును ప్రభుత్వం కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించే కిట్లలో చేర్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Read More : Pooja Hegde: పూజ పాపకి బంపర్ ఆఫర్.. పవన్‌తో ఛాన్స్!

కరోనా వైరస్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో పంజా విసిరింది. ఈ వైరస్ బారిన వేలాది మంది పడ్డారు. చాలా మంది చనిపోయారు కూడా. ఈ నెలల్లో మొత్తం 4.81 కోట్ల గోలీలను వినియోగించారని తేలింది. కోవిడ్, కోవిడేతర వ్యాధుల బాధితులు 32 లక్షల మంది దాక చికిత్స పొందారని అధ్యయనంలో గుర్తించారు. పారాసెటమాల్ అత్యధికంగా వాడుతుండడంతో ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంది.

Read More : Chhattisgarh : భార్యతో బలవంతంగా శృంగారం చేస్తే అత్యాచారం కాదు

ప్రతి 10 రోజులకు ఒకసారి కోటి గోలీల చొప్పున దవఖానాల్లో రీ స్టాక్ చేసింది. ఇక కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా..ఇదే కాలానికి 1.03 లక్షల లివోసిట్రజిన్ గోలీలను ప్రజలు వేసుకున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 15 వేల 249 N-95 Mask, 34, 221 సర్జికల్ మాస్క్ లు, 59 వేల సర్జికల్ గ్లోవ్స్, తదితర వైద్య పరికరాలను ప్రజలు ఉపయోగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.