Warangal
Warangal : వరంగల్ లోని ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడ్డళ్లు కత్తులతో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆస్తి తగాదాలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను బాంద్‌పాషా, ఖలీల్, సబీరాగా గుర్తించారు. ఈ దారుణ ఘటనతో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.