Former BRS MLA Aruri Ramesh Resign
Aruri Ramesh : బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు.
Read Also : అందుకే కవిత అరెస్ట్.. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా: అద్దంకి దయాకర్
బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ పెద్దలకు ధన్యవాదాలు :
పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ఆరూరి కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు అడ్డుకుని పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్‌లోనే ఉంటానని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అరూరి రమేష్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
Read Also : BSP-BRS Alliance : బీఆర్ఎస్‌తో పొత్తుని అందుకే నిరాకరిస్తున్నాం.. బీఎస్పీ సంచలన ప్రకటన..!