అందుకే కవిత అరెస్ట్.. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా: అద్దంకి దయాకర్

Addanki Dayakar: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే పొలిటికల్ డ్రామా ఆడారని చెప్పారు.

అందుకే కవిత అరెస్ట్.. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా: అద్దంకి దయాకర్

Addanki Dayakar

తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల వెనుక బీజేపీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, బీఏస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక బీజేపీ ఉందని చెప్పారు.

కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే పొలిటికల్ డ్రామా ఆడారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసును ఓ వెబ్ సిరిస్‌లా నడిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పొలిటికల్ డ్రామాను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు.

దక్షిణాదిన బలం పెంచుకునేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సహకరించిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు.

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు