Bodige Shobha: బండి సంజయ్ కేసులో బొడిగె శోభకు హైకోర్టులో ఊరట!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 2వ తేదీన చేపట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Bodige Shobha: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 2వ తేదీన చేపట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. బండి సంజయ్ అరెస్ట్ కేసులో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు హైకోర్టులో ఊరట లభించింది.

రిమాండ్ ఆర్డర్‌పై హైకోర్టులో బొడిగె శోభ క్వాష్ పిటిషన్ వేయగా.. 25 వేల రూపాయల షూరిటీని కరీంనగర్ సెషన్స్ కోర్టులో సమర్పించి బెయిల్ పొందాలని హైకోర్టు సూచించింది.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దీక్ష చేప్టటారని.. విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద బండి సంజయ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

అదే రోజు మొత్తం 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ10 నిందితురాలిగా ఉన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. కరీంనగర్ కోర్టులో షూరిటీ చెల్లించి బెయిల్ పొందాలని సూచించింది.

 

ట్రెండింగ్ వార్తలు