Site icon 10TV Telugu

నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. భారీగా పోలీసుల మోహరింపు

Kaleshwaram KCR

KCR

కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11.30 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఎర్రవెల్లి ఫాంహౌస్‌ నుంచి కేసీఆర్ బయలుదేరన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌తో రానున్నారు.

కేసీఆర్ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 9.30 కి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కేటీఆర్ వచ్చి, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. బీఆర్కే భవన్ దగ్గరకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులను మోహరించారు.

Also Read: ఈ 5 స్మార్ట్‌ఫోన్లు అదుర్స్‌.. వీటిని ఎందుకు కొనొచ్చంటే?

కేసీఆర్ కు తోడుగా కమిషన్ ముందుకు తొమ్మిది మంది నేతలు వెళ్లున్నట్లు తెలుస్తోంది. వారిలో హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే కమిషన్ ముందు విచారణకు ఈటల రాజేందర్, హరీశ్ రావు హాజరయ్యారు. ఇప్పటి వరకు కమిషన్ విచారించిన తీరులో స్వల్ప మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఇన్ కెమెరా పద్ధతిలో విచారించే అవకాశం ఉంది.

కమిషన్ అవకాశం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారు. కమిషన్ కు వెయ్యి పేజీలకు పైగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను కేసీఆర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను అడిగేందుకు కమిషన్ 25కు పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. అందరిలా ప్రశ్నల వరకే పరిమితం కాకుండా కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యాక తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.

Exit mobile version