KCR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

తమ పోరాటం ఒక్కరిపై కాదన్నారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను..

కేఆర్ఎంబీపై తెగించి కొట్లాడదామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను తిప్పికొట్టారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. అయితే, అందుకు తాము అంగీకరించలేదని చెప్పారు. ఆయా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి తీసుకోవాలని చెప్పామన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని చెప్పారు.

తమ పోరాటం ఒక్కరిపై కాదన్నారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. అయిదు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని చెప్పారు.

కేసీఆర్ కామెంట్స్

  • కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు
  • కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ ప్రాజెక్ట్ లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని నన్ను బెదిరించారు
  • కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో…నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా…తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పినా..
  • నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు…
  • నన్ను … నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు… నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది..
  • రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం…దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు.
  • తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కు పోడు…ఉడుత బెదిరింపులకు బయపడను…
  • ముందు ముందు ఏందో చూద్దాం…తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు..

 

YCP: హిందూపురం వైసీపీ గ్రూప్‌ రాజకీయాలతో అధినేత సతమతం.. ఏం జరుగుతుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు