బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను విచారిస్తున్న పోలీసు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను విచారిస్తున్న పోలీసు

Updated On : January 6, 2021 / 12:24 PM IST

Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ మంత్రి  అఖిల ప్రియ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 2021, జనవరి 06వ తేదీ బుధవారం ఆమెను అదుపులోకి తీసుకుని బోయిన్ పల్లి పీఎస్ కు తరలిస్తున్నారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియ, ఆమె భర్తపై పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌, అసలేం జరిగింది ?
మంగళవారం రాత్రి 7.20కి ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లిన కిడ్నాపర్లు
రాత్రి 7.25కు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించిన కిడ్నాపర్లు
ఇన్‌కం టాక్స్‌ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డ్స్ చూపెట్టిన కిడ్నాపర్లు
రాత్రి 7.30కి సెల్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, డాక్యుమెంట్‌ తీసుకున్న కిడ్నాపర్లు
ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావును ఒక గదిలో బంధించిన దుండగులు

రాత్రి 7.35 కు విచారణ జరపాలంటూ ముగ్గురిని వాహనాల్లోకి ఎక్కించిన కిడ్నాపర్లు
మూడు వాహనాల్లో పారిపోయిన కిడ్నాపర్లు
రాత్రి 8 గంటలకు ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు ఫోన్‌ చేసిన బంధువులు
తాము ఎక్కడా రైడ్స్‌ చేయలేదన్న ఐటీ అధికారులు
రాత్రి 8.30కి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేసిన బంధువులు
హైదరాబాద్‌ సీపీని రంగంలోకి దించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

వెంటనే సెర్చ్‌ ఆపరేషన్ మొదలుపెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
హైదరాబాద్‌లో అణువణువు గాలించిన టాస్క్‌ఫోర్స్‌
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సమాచారంతో గాలింపు ముమ్మరం
పోలీసులకు దొరికిపోతామని గ్రహించి ముగ్గురిని వదిలేసిన కిడ్నాపర్లు
తెల్లవారుజామున 3.30కి ఇంటికి తిరిగొచ్చిన సునీల్‌రావు, నవీన్‌రావు, ప్రవీణ్‌రావు