×
Ad

Krishna Yadav : బీజేపీకి గూటికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. కృష్ణ యాదవ్ తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

  • Published On : July 30, 2023 / 12:24 PM IST

Krishna Yadav

Krishna Yadav Join BJP : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయా పార్టీల్లో చేరికలు జోరందుకున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వేగంగా నేతలు మారుతున్నారు. రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వారికి అనుకూలమైన పార్టీలోకి అడుగులు వేస్తున్నారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీలో చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. కృష్ణ యాదవ్ తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వాలని అడుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంబర్ పేట్ లేదా మలక్ పేట్ టికెట్ ను ఆయన అడుగుతున్నట్లుగా సమాచారం.

Love Jihad : లవ్ జిహాద్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

అయితే, అంబర్ పేట్ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు సార్లు కూడా ఇక్కడి నుంచే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో మలక్ పేటపై ఏమైనా హామీ ఇస్తారా అనేది చూడాలి. కృష్ణ యాదవ్ తోపాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి బీజేపీ రాష్ట్ర నాయకులతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరితో మాజీ ఎంపీ వివేక్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.