Love Jihad : లవ్ జిహాద్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

దేశంలో లవ్ జిహాద్ పై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉద్రిక్తతలను నివారించేందుకు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా సీఎం శర్మ గళం విప్పారు....

Love Jihad : లవ్ జిహాద్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

cm Himanta Biswa

Love Jihad : దేశంలో లవ్ జిహాద్ పై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉద్రిక్తతలను నివారించేందుకు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా సీఎం శర్మ గళం విప్పారు. (Himanta Biswa) హిందూ, ముస్లిం వర్గాల మధ్య సాంస్కృతిక విభేదాలు తలెత్తకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశనం చేయాలని సీఎం హిమంత బిస్వాశర్మ విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నందున దీనిని ఆపాలని సీఎం సూచించారు. (Love Jihad creates tension) అసోం రాష్ట్ర పోలీసు సూపరింటెండెంట్‌ల రెండు రోజుల సమావేశం తర్వాత బొంగైగావ్‌లో విలేకరులతో సీఎం మాట్లాడారు.

Ahmedabad Hospital : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..100 మంది రోగుల తరలింపు

రాష్ట్రంలో హిందువులు, ముస్లింల మధ్య శాంతియుత సహజీవనం ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. (must be stopped) దీనికోసం లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడులు వంటి అంశాలు ఉద్రిక్తతలు సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ కేసుల్లో చాలా సందర్భాల్లో అమ్మాయిలను బలవంతంగా తీసుకెళ్లడం, ఆపై వారితో తీసిన కొన్ని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం కనిపిస్తుందన్నారు. అమ్మాయిలను బలవంతంగా వేరే మతంలోకి మార్చి, బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, అలాంటి వివాహాలపై విచారణ జరపాలని సీఎం కోరారు.

Thailand : థాయ్‌లాండ్‌లో బాణసంచా గోదాం పేలుడు, 10 మంది మృతి, 118 మందికిపైగా గాయాలు

‘‘ఒక ఖాజీ హిందూ-ముస్లిం వివాహాన్ని నమోదు చేయలేరు. అదే విధంగా హిందూ పూజారి కూడా చట్టబద్ధంగా పెళ్లి చేయలేడు… వివిధ మతాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారు మతం మారకుండానే పెళ్లి చేసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Himachal Tourists : పర్యాటకులకు శుభవార్త…హిమాచల్ హోటల్ అసోసియేషన్ 50 శాతం డిస్కౌంట్

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులకు మూలకారణమైన లవ్‌ జిహాద్‌ కేసులను విచారించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి పోలీసులను కోరారు. హిందూ స్త్రీలను వివాహం ద్వారా మత మార్పిడి చేయడానికి ముస్లిం పురుషులు పన్నుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. అసోం రాష్ట్రంలో బాల్య వివాహాలు, బహుభార్యత్వం రెండింటినీ నిషేధిస్తామన్నారు.