×
Ad

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఈసీకి కవిత దరఖాస్తు? పార్టీ పేరు ఇదే?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్‌ వేసుకుంటున్నట్లు సమాచారం.

  • రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి?
  • ఢిల్లీకి జాగృతి ప్రతినిధులు వెళ్లి దరఖాస్తు
  • మరో మూడు నెలల్లో రాజకీయ పార్టీగా గుర్తింపు 

Kalvakuntla Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతిని ఆమె రాజకీయ పార్టీగా మార్చడానికి ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఆమె తరఫున ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ఈసీఐకి దరఖాస్తును సమర్పించారని తెలుస్తోంది. మరో మూడు నెలల్లో రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతికి గుర్తింపు వచ్చే ఛాన్స్‌ ఉంది.

Badrinath-Kedarnath Temple : ‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’

దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్‌ వేసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జాగృతిలో చేరాలని ఆమె ఇటీవల కోరారు.

పార్టీ పేరుతో పాటు గుర్తు, విధివిధానాలపై కవిత ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పార్టీకి కవిత “తెలంగాణ ప్రజా జాగృతి” పేరును నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది నాటికి ఈ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

తన కొత్త పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం అంకితమై పనిచేస్తుందని కవిత ఇప్పటికే చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అన్నారు. యువతా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.