వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విబేధాలు.. ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు .. 

పేదల ఆస్తులు కూలిస్తే సారయ్యకు గుర్తింపు రాదు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాం. ఎవరిని బెదిరించి రాజకీయాలు చేయడం లేదు.

Konda Murali and MLC Saraiya

Former MLC Konda Murali : వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నట్లుగా రాజకీయ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళి ఫైర్ అయ్యారు. వేరే పార్టీ నుంచి వచ్చిన సారయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేను ఏకగ్రీవ ఎమ్మెల్సీని అయినా రాజీనామా చేశా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చెయ్
అంటూ సవాల్ చేశారు. వరంగల్ లో నడిచేది కొండా ప్రభుత్వం.. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం అంటూ హెచ్చరించారు. బీసీ నాయకుడివై ఉండి బీసీలకు అన్యాయం చేస్తావా అంటూ సారయ్య పై మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. సారయ్య వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

Also Read : నడిరోడ్డుపై డబ్బులు గాల్లోకి ఎగరేసిన యూట్యూబర్ హర్ష.. కేసు నమోదు చేసిన పోలీసులు

పేదల ఆస్తులు కూలిస్తే సారయ్యకు గుర్తింపు రాదు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాం. ఎవరిని బెదిరించి రాజకీయాలు చేయడం లేదు. మమ్మల్ని చూసి నేర్చుకో.. నీ సొంత తమ్ముడే నిన్ను విభేదిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ఎవరైనా రాజీనామా చేసి రావాలని సారయ్యను ఉద్దేశించి కొండా మురళి వ్యాఖ్యానించారు.

Also Read : ఈసారైనా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం వ్యవ‌హారం కొలిక్కి వచ్చేనా?

గత ఎన్నికల్లో కొండా సురేశ్ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయం సాధించారు. మంత్రి వర్గంలో ఆమెకు స్థానం దక్కింది. మరోవైపు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయన శిష్యుడిగా పేరొందిన ఎమ్మెల్సీ సారయ్య రెండు నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. సారయ్య కాంగ్రెస్ లోకి రావడాన్ని కొండా దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పెద్దలు వారికి సర్దిచెప్పడంతో వెనక్కు తగ్గారు. అదే సమయంలో తూర్పు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు సారయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో సారయ్య వర్సెస్ కొండా వర్గాల మధ్య వివాదం మొదలైందని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట గోపాలస్వామి గుడి రోడ్డులో చిరు వ్యాపారుల డబ్బాలను గ్రేటర్ వరంగల్ సిబ్బంది తొలగించారు. దీని వెనుక సారయ్య ఉన్నాడని ప్రచారం జరగడంతో కొండా మురళి సారయ్యపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు