CM Revanth Reddy: రఘురాం రాజ‌న్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. ఏఏ విషయాలపై చర్చించారంటే

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన రఘురాం రాజన్ కు రేవంత్ రెడ్డితోపాటు ..

Revanth Reddy

Former RBI Governor Raghuram Rajan : సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన రఘురాం రాజన్ కు రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరి మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై రఘురాం రాజన్ రేవంత్ కు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. రఘురాం రాజన్ గతంలో కేంద్ర ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేశారు.

Also Read : Today Gold Price : ఈ ఏడాది 13శాతం పెరిగిన గోల్డ్ ధర.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపును అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాల అమలుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో మంత్రులు, అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, రాబడి, వ్యయాలు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో పథకాల అమలుకు నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు