Old City Metro Route : ఓల్ట్‌ సిటీలో మెట్రో రూట్ నిర్మాణానికి ముందడుగు..!

Old City Metro Route : ఓల్ట్‌ సిటీ మెట్రో రూట్‌కు ఎట్టకేలకు ముందడుగు పడింది. గతంలో ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని... మెుదటి దశలో 72 కిలో మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

Foundation Stone For Old City Metro to Be Laid on March 8

Old City Metro Route : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎప్పట్నుంచో నిలిచిపోయిన ఓల్ట్‌ సిటీ మెట్రో రూట్‌కు ఎట్టకేలకు ముందడుగు పడింది. గతంలో ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని… మెుదటి దశలో 72 కిలో మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే.. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. ఈ రూట్‌ను త్వరగా పూర్తి చేయాలని అక్కడి ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నా… కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మెట్రో మార్గానికి శుక్రవారం (మార్చి 8న) శంకుస్థాపన చేయనున్నారు.

Read Also : CM Jagan : ఆయన పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తుకొస్తాయి- సీఎం జగన్ నిప్పులు

ఓల్డ్ సిటీ మెట్రో మార్గం 5.5 కిలోమీటర్లు : 
ఓల్డ్ సిటీ మెట్రో మార్గం 5.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. 2018లో మెట్రో పనులు ప్రారంభించాలని… హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ L అండ్‌ Tకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిల్లర్ల ఫౌండేషన్ పనులకు  మార్కింగ్ చేశారు. అయితే… ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారడంతో పనులు ముందుకు వెళ్లలేదు. సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ.., 103కు పైగా ప్రార్థన, మత సంబంధమైన స్థలాలకు ఇబ్బంది కలగకుండా  మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ ఆఫ్‌ వే స్థలాన్ని సేకరించడం అధికారులకు కత్తిమీదసాము అయ్యింది.

దీంతో ఓల్డ్‌ సిటీలో మెట్రో పనులను చేపట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ విముఖంగా ఉన్నట్లు చర్చ జరిగింది. తర్వాత కరోనా రావటంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశలవారీగా సమీక్షలు చేసి… ప్రాజెక్టును ప్రారంభించాలని చెప్పడంతో అధికారులు పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును పట్టా లెక్కిస్తున్నారు.

దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు : 
ఓల్డ్‌ సిటీ మార్గంలో సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్‌ , ఫలక్‌నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను నిర్మించే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేశారు. గతంలోనే MGBS నుంచి ఫలక్‌నుమా మార్గంలో మెట్రో నిర్మాణానికి ఆస్తులు సేకరించాలంటే దాదాపు 300 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేశారు.  ప్రతి కిలో మీటర్‌ నిర్మాణానికి దాదాపు 200 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు, పూర్తికావటానికి ఎంత సమయం పడుతుందనే అంశం తేలాల్సి ఉంది.

33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు, 6 చిల్లాలు : 
ఓల్డ్‌ సిటీ మెట్రో పనులకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది…, వాటికి అయ్యే ఖర్చుల వివరాలు లెక్కలు రావాల్సి ఉంది. 103 మతపరమైన కట్టడాల్లో  21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు, 6 చిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఆస్తుల సేకరణ చేసి రైట్ ఆఫ్ వే కల్పిస్తే వేగంగా పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Read Also : Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!

ట్రెండింగ్ వార్తలు