బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్..ఒకేసారి నలుగురు దుర్మరణం

Four deaths simultaneously with electric shock : మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జనవరి 9, 2021) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమనగల్లు గ్రామానికి చెందిన చెన్నబోయిన రాధమ్మ (49), భర్త సత్తయ్య (59) భార్యాభర్తలు.

రాధమ్మ ఉతికిన బట్టలు ఆరేస్తుండగా దండెం తీగకు విద్యుత్‌ సరఫరా కావడంతో ఆమెకు విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో భార్య రాధమ్మను కాపాడేందుకు భర్త సత్తయ్య ప్రయత్నించడంతో ఆయన కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. కేకలు వేయడంతో ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య-లక్ష్మి దంపతులు వెళ్లి వీరిని రక్షించే సమయంలో విద్యుత్ షాక్ కు గురై ఒకరి తరువాత ఒకరు నలుగురూ మృతి చెందారు.

మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలిపిస్తున్నారు. ఒకేసారి నలుగురి మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు