Accident
Four killed in road accident : మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కొంతమంది కారులో మేడారం జాతరకు వెళ్లారు. జాతరకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నారు.
మార్గంమధ్యలో గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల స్వగ్రామం వాజేడు మండలం చందుపట్లగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వాజేడు నుంచి హన్మకొండ వెళ్తుండగా ఘటన చెోటు చేసుకుంది.