Accident
Four Killed In Road Mishap In Mulugu : రోడ్లపై జరుగుతున్న అనేక ప్రమాదాలకు ఎన్నో కారణాలుంటున్నాయి. మద్యం సేవించి నడపడం, అతివేగం, నిర్లక్ష్యం పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం.. ఇలాంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎఫ్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినా.. రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గడం లేదు.
Read More : Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు
తాజాగా..తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురి జీవితాలు గాలిలో కలిసిపోయాయి. మరో నలుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 2022, మార్చి 04వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఈ ఈ ఘటన చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన ఎనిమిది మంది ఆటోలో షరీఫ్ దర్గాకు వెళ్లి వస్తున్నారు. ఏటూరు నాగారం నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ వస్తోంది. ఈ వ్యాన్ లో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఎర్రి గట్టమ్మ వద్ద ఆటో..డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Read More : Gaddiannaram Market : గడ్డి అన్నారం మార్కెట్‌ను వెంటనే తెరవాలని హైకోర్టు అదేశం
దీంతో స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. అటుగా వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలపాలైన నలుగురిని (పల్లె భోజన పద్మ, రసూల్, వెన్నెల, వసంత) ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో అజయ్, కిరణ్, కౌసల్య, ఆటో డ్రైవర్ జానీగా గుర్తించారు. డీసీఎం ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.