Gaddiannaram Market : గడ్డి అన్నారం మార్కెట్‌ను వెంటనే తెరవాలని హైకోర్టు అదేశం

హైదరాబాద్ నగరం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Gaddiannaram Market : గడ్డి అన్నారం మార్కెట్‌ను వెంటనే తెరవాలని హైకోర్టు అదేశం

Gaddiannaram Market (1)

Gaddiannaram Market : హైదరాబాద్ నగరం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మార్కెట్ లో ఉన్న సామాగ్రి తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని హైకోర్టు తెలిపింది.

కాగా, గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ గతేడాది మూత‌ప‌డింది. మార్కెట్‌ను ప్రభుత్వం బాట‌సింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించాలని నిర్ణయించింది. అయితే, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

బాటసింగారంలో మార్కెట్ యధావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పండ్ల మార్కెట్ ను సెప్టెంబర్ 25 మూసివేసింది. ఒక్కసారిగా మార్కెట్ మూసివేయడంతో మార్కెట్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్కెట్ లో ఉన్న ఫర్నీచర్, ఏసీ సామగ్రి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. మార్కెట్ లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై కోర్టు మరోసారి విచారించింది. గతంలో కోర్టు ఇచ్చిన సమయం పూర్తయినా ఇంకా మార్కెట్ తెరవలేదని మార్కెట్ సిబ్బంది కోర్టుకి తెలిపింది. వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి మార్కెట్ సిబ్బంది తమ సామాగ్రి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అధికారుల వెంటనే రంగంలోకి దిగారు. కొత్తపేట పండ్ల మార్కెట్ ను తెరిచారు. ఈ వ్యవహారంలో ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం తరలించింది. అయితే, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉన్నపళంగా మార్కెట్‌ను మార్చడాన్ని తప్పుపడుతూ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఆస్పత్రిని సుమారు 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం 1490 పడకలతో ఉన్న నిమ్స్‌ ఆస్పత్రిని కొత్తగా 3490 పడకలతో విస్తరిస్తారు. మిగిలిన నాలుగు ఆస్పత్రులను 1000 పడకలతో నిర్మిస్తారు.

రాష్ట్రంలో అతి పెద్ద ఆస్పత్రిగా నిమ్స్‌ మారనుంది. ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొన్నింటిని కూలగొడతారు. మిగిలిన స్ట్రక్చర్‌ అలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిమ్స్‌ పక్కనే ఉన్న 18 ఎకరాల ఎర్రమంజిల్‌ స్థలంలో నిమ్స్‌ను విస్తరిస్తారు. మరోవైపు నగరానికి నాలుగు దిక్కుల నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను 1000 పడకలతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. గచ్చిబౌలిలో ఇప్పటికే ఉన్న టిమ్స్‌లో మరికొన్ని భవనాలు నిర్మిస్తారు. సనత్‌నగర్‌ ఛాతీ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌, ఆల్వాల్‌.. ఇలా మరో మూడు ప్రాంతాల్లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తారు.