Representative Image
ఏసీబీ అధికారులమంటూ కొంత కేటుగాళ్లు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు నమోదు చెయ్యకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని అమాయకులను కేటుగాళ్లు బెదిరిస్తున్నారని చెప్పారు.
ఏసీబీ అధికారులు ఎన్నడూ డబ్బులు డిమాండ్ చేయరని తెలిపారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వాటిని ప్రభుత్వ ఉద్యోగులు నమ్మవద్దని ఏసీబీ అధికారులు చెప్పారు. ఓ నకిలీ ఏసీబీ అధికారిపై ఖమ్మం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని అన్నారు.
ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజల వద్దకు ఏవైనా నకిలీ కాల్స్ వస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 1064కు ఫోన్ చేసి చెప్ఆపలని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని అన్నారు.
తెలంగాణ ఏసీబీని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా కూడా సంప్రదించవచ్చని చెప్పారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X (@TelanganaACB) ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఇలాంటి ఫిర్యాదులు చేస్తే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.