Raghunandan Rao : మహిళలకు ఉచితంగా డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్స్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Raghunandan Rao : మహిళలకు ఉచితంగా డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్స్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు

MLA Raghunandan Rao

Updated On : August 31, 2023 / 4:47 PM IST

Raghunandan Rao – Free Driving And License : తెలంగాణలో ఎన్నికల ముందు యువతను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా డ్రైవింగ్, లైసెన్స్ మేళాలు నిర్వహిస్తున్నారు. యువత, మహిళలకు ఉచిత డ్రైవింగ్, లైసెన్స్ లు ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను ఆకర్షించే పనిలో పడ్డారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు, పలువురు నేతలతోపాటు పలు పార్టీల నాయకులు ఉచిత డ్రైవింగ్, లైసెన్స్ మేళా కార్యక్రమాలను నిర్వహించారు.

తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ఉచిత డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి.  ఎమ్మెల్యే రఘునందన్ రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 10 నుంచి మహిళలకు ఉచిత డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్సు పంపిణీ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Google AI Features India : గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త సెర్చ్ ఫీచర్లు.. భారతీయ యూజర్లు ఎలా వాడొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

రాఖీ పౌర్ణమి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 7893335975 whatsup నెంబర్ కు పేరును నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 10 నుండి ఉచిత డ్రైవింగ్ ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలోనూ పలువురు మంత్రులు, నాయకులు ఉచిత డ్రైవింగ్, లైసెన్స్ మేళాలను నిర్వహించారు.

జులై7, 2023న ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు సూచనలతో ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించాలని పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లెసెన్స్ మేళాకు అయ్యే ఖర్చును పువ్వాడ ఫౌండేషన్ భరిస్తుందన్నారు.

iQOO Z7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ Z7 ప్రో ఫోన్ వచ్చేసింది.. ఈ 5G ఫోన్ ధర ఎంతో తెలుసా? సేల్ డేట్ ఎప్పుడంటే?

బాల్కొండ నియోజకవర్గం యువతీయువకుల కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రాంగంణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్, లెర్నింగ్ లైసెన్స్ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీప్ సెంటర్ ను జులై 29, 2023న రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.

సోమవారం జులై 17,2023న ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో పాలకుర్తిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జులై17 నుంచి జులై31వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలన్న లక్ష్యంతోనే ఈ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.