Free Special Trains From Telangana to ayodhya Ram mandir for ram devotees
Special Trains Ayodhya Temple : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఈ మహోన్నత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సినీ, రాజకీయ, క్రీడాకారులు, రామ భక్తులు, పండితులు అత్యధికం సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చారు.
జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు కూడా బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నారు. తెలంగాణకు చెందిన బాలరామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భక్తులను పలు తేదీలు వారీగా అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్లనున్నారు.
Read Also : అలంకారంతో మెరిసిపోయిన రాముడు.. ప్రతి ఆభరణానికి ఒక్కో విశిష్టత.. ఏంటో తెలుసా?
ప్రతి భోగికి ఒక ఇంఛార్జి… ప్రతి రైలుకు 20బోగీలు :
బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి తెలంగాణ టు అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మంది అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 20 బోగీలు ఉంటాయి. ఒక్కో ట్రైనులో 1,400 మంది భక్తులు ప్రయాణించవచ్చు. ప్రతి బోగీకి ఒక్కో ఇంఛార్జ్ ఉంటారు. అయోధ్యకు వెళ్లివచ్చేందుకు మొత్తం 5 రోజుల సమయం పట్టనుంది.
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఇదే.. ఒక్కో ట్రైన్‌లో 14వందల మందికి ఛాన్స్..!
Special Trains From Telangana to ayodhya
నియోజకవర్గాల వారీగా.. 17 రోజుల పాటు ప్రత్యేక రైళ్లు :
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు బయల్దేరనున్నాయి.
సికింద్రాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి భక్తులు ఈ ప్రత్యేక రైళ్లలో వెళ్లనున్నారు. భక్తులందరూ సికింద్రాబాద్‌లో ప్రారంభయ్యే ప్రత్యేక రైళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం నియోజకవర్గాలకు చెందిన రామ భక్తులు కాజీపేట స్టేషన్ నుంచి బయల్దేరే రైళ్లలో ప్రయాణించాలి.