Ambulance Driver: తండ్రికి అంత్యక్రియలు చేయని కుమార్తెలు. మానవత్వం చాటుకున్న అంబులెన్స్ డ్రైవర్

Ambulance Driver

Ambulance Driver: కరోనా మహమ్మారి బంధాలను బంధుత్వాలను పలచన చేస్తుంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. బంధువులు ఎందరు ఉన్నా కొందరు కరోనా బాధితులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరు దగ్గరికి రాకపోవడంతో మానవత్వం కలిగిన వారు అంత్యక్రియలు చేస్తున్నారు.

ఇక ఇటువంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా సోకడంతో భయపడిన 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు కూతుర్లు ఉన్నా ఒక్కరు కూడా రాకపోవడంతో అంబులెన్స్ డ్రైవర్, ఓ మెకానిక్ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వీణవంక మండలం నిర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

కరోనా సోకిందని తనకు ఏమవుతుందో ఏమో అని భయంతో ఇంగయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరు తండ్రి మృతదేహం చూడటానికి కూడా రాలేదు.

అల్లుళ్లు, మమవాళ్లు మనవరాళ్లు ఉన్న ఒక్కరుకూడా మృతదేహాన్ని చూసేందుకు రాలేదు. ఇంగయ్య గురించి తెలుసుకున్న నర్సింగాపూర్ ప్రాంతానికి చెందిన 108 డ్రైవర్ శ్రీనివాస్, మెకానిక్ ఇమ్రాన్ పాష అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వీరు చూపిన మానవత్వానికి స్థానికులు మెచ్చుకుంటున్నారు.