Ganesh Chaturthi: వినాయక చవితి, నిమజ్జనంపై క్లారిటీ వచ్చేసింది.. గణేశుడి పండగ ఎప్పుడంటే?

వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది.

ganesh chaturthi 2023 date and nimajjanam date

Ganesh Chaturthi 2023: వినాయక చవితి, (Vinayaka Chavithi) నిమజ్జనంపై ఉన్న డౌట్స్ పై క్లారిటీ ఇచ్చింది గణేశ్ ఉత్సవ కమిటీ. ఈనెల 18న పండుగ, 28న నిమజ్జనం (nimajjanam) చేయాలని నిర్ణయించారు. దీంతో చవితి పండుగ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ (GMHC) కీలక సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని 20 ప్రాంతాల్లో లక్ష మట్టి గణపతి విగ్రహాలను (clay ganesh idol) ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే బల్దియా పరిధిలోని కార్పొరేటర్ల ద్వారా మరో 3 లక్షల 10 వేల విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.

తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలతో పాటు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంలో మొత్తం 74 కొలనులు ఏర్పాటు చేయడంతో పాటు, 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్స్, మరో 27 బేబీ పాండ్స్ అందుబాటులో ఉంచనున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్లో 7 ప్లాట్ఫాంలు, ట్యాంక్బండ్పై 14, బుద్ధ భవన్వైపు 7 ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద 8 భారీ క్రేన్లతో పాటు, హెలిప్యాడ్, సంజీవయ్య పార్కు బేబీ పాండ్ వద్ద క్రేన్లు, 23 ప్రాంతాల్లో ఎక్సలేటర్స్ అందుబాటులో ఉంటాయి.

Also Read: లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం వరిస్తుందా..?

భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు సూచనల మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లకు కార్యాచరణ రూపొందించారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో డ్రైనేజీల నిర్వహణ, మ్యాన్ హోల్స్ మరమ్మతులు, తాగునీటి సరఫరా ఉంటుంది. 453 మంది డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 33 చెరువుల వద్ద 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతారు. ఇక నిమజ్జనం, మండపాలు, ఊరేగింపు సందర్భంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు.

Also Read: ఈ గుడిలోకి వెళితే పుణ్య స్త్రీలు వితంతువులు అవుతారట..!

జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే కలెక్టర్ల సహకారంతో అన్ని ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల సమన్వయంతో అత్యవసర చికిత్స అందించేందుకు అంబులెన్స్లు సిద్ధం చేస్తారు. 6 డివిజన్ల పరిధిలో 79 అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 10,500 మంది శానిటేషన్ కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ కోసం నిర్ధిష్టమైన తేదీని ప్రకటించాలని గణేశ్ ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది. సర్కిల్ స్థాయిలో పోలీస్, జిహెచ్ఎంసి అధికారులు, కమిటీ సభ్యులతో సమన్వయ కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు