Strange Temple : ఈ గుడిలోకి వెళితే పుణ్య స్త్రీలు వితంతువులు అవుతారట..!

ఆగుడిలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేదు.ఒకవేళ ఎవరైనా వెళితే వితంతువులు అయిపోతారట. దీని వెనుక చాలా ఆసక్తి కలిగించే కథనాలు ఉన్నాయి. వితంతువులు అవుతారనే భయంతో మహిళలు ఎవ్వరు ఆ దేవాలయంలోకి అడుగు కూడా పెట్టరు.

Strange Temple : ఈ గుడిలోకి వెళితే పుణ్య స్త్రీలు వితంతువులు అవుతారట..!

kurukshetra karthikeya temple

Strange Temple In Kurukshetra Haryana  : భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. అలాగే కొన్ని ఆలయాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. అటువంటిదే కేరళలోని శబరిమల, మహారాష్ట్రలోని శనీశ్వరాలయం వంటివి. కానీ భారత్ లో ఉన్న ఓ దేవాలయంలో ఆడవారి విషయంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే పుణ్యస్త్రీల గురించి చాలా విచిత్రమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలోకి పుణ్యస్త్రీలు లేదా వివాహితలు, సౌభాగ్య స్త్రీలు అంటే ముతైదువలే వెళితే వారు వితంతువులు అవుతారట..అంటే వారి భర్త చనిపోయి వైధ్యం వస్తుందట.ఇటువంటి ఓ దేవాలయం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి ఓ వింత దేవాలయం గురించి..అది ఎక్కడుంది…? ముతైదువులు వెళితే వితంతువులుగా ఎందుకు అవుతారు..? దాని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం..

మహాభారత యుద్ధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పాండవులకు, కౌరవులుకు జరిగిన యుద్ధం కురుక్షేత్రం. ఎంతోమంది ప్రాణాలు హరించిన యుద్ధం. ధర్మయుద్ధంగా చెప్పుకునే ఈకురుక్షేత్రం నగరంలో ఉందీ వింత దేవాలయం. కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలో ఉంది.. ఈకురుక్షేత్రం నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన పవిత్రమైన జ్ఞానాన్ని బోధించాడట.అంటే భగవద్గీతను బోధించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి.

Krishna Janmashtami 2023 : ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారో మీకు తెలుసా?

కురుక్షేత్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా వెళితే వారు వితంతువులు అవుతారట. దీంతో ఈ దేవాలయం మహిళలు అశుభంగా భావిస్తారు. ఏ స్త్రీ అయినా పుణ్యస్త్రీగా పసుపు కుంకుమలతో ఉండాలని భావిస్తుంది. అలాగే చనిపోవాలని భావిస్తుంది. మరి తన సౌభాగ్యానికి అశుభం కలుగుతుందని తెలిస్తే ఎవరు వెళతారు అటువంటి దేవాలయంలోకి..అందుకే ఈ దేవాలయంలోకి మహిళలు ఎవ్వరు వెళ్లరు.

ఆ దేవాలయం శివుని కుమారుడైన కుమారస్వామి కార్తికేయుడుగా పూజలందుకుంటున్నాడు. కురుక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహోవాలో ఉంది. పంజాబ్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ దేవాలయంలోకి మహిళల ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా వెళితే వారు వితంతువు అవుతారట..కార్తికేయుడు కొలువైన ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళ వితంతువుగా శాపానికి గురవుతుందని నమ్ముతారు.

ఈ నమ్మకం వెనుక పురాణ కథలున్నాయి. ఓ కథనం ప్రకారం..ఒక మహిళ ఒకరోజు ఆలయంలోకి ప్రవేశించిందట. అనుకోకుండా శివుని పవిత్రమైన శివలింగాన్ని తాకిందట. శివుడికి ఆగ్రహం కలిగిందట. ఆ కోపంలో పరమేశ్వరుడు ఆ స్త్రీని వితంతువుగా ఉండమని శపించాడట.

Laughing Buddha : లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం వరిస్తుందా..?

మరొ కథనం ఏంటంటే.. ఎప్పుడో పూర్వకాలంలో కొంతమంది మహిళలు ఆ దేవాలయంలోకి వెళ్లి శివుడిని దర్శించుకోవాలనుకున్నారట. వారిని కొంతమంది పురుషులు అడ్డుకున్నారట. దానికి కారణం ఆ మహిళలు బహిష్టు అవుతారు కాబట్టి వారు ఆలయంలోకి వస్తే ఆలయం అపవిత్రం అవుతుందని వారు ఆపేశారట. కానీ కొంతమంది మాత్రం పురుషులను దాటుకుని గుడిలోకి ప్రవేశించగా వారి వితంతువులు అయిపోయారట. దీంతో ఆ గుడి మహిళలకు అశుభం అని భావించటం మొదలుపెట్టి ఆ నమ్మకం ఈనాటికి కొనసాగుతోంది. ఆ ఆలయంలోకి వెళితే సౌభాగ్యం పోయి వితంతువులు అవుతారనే భయం కొనసాగుతోంది.

మరో కథనం చూస్తే..ఈ ఆలయంలో కార్తికేయ స్వామి పవిత్రమైన బ్రహ్మచారి రూపాన్ని పూజిస్తారు. అందుకే ఈ గుడిలోకి ప్రవేశించడానికి మహిళలకు అనుమతి లేదని అంటారు. ఒకవేళ ఆడవారు ఈ దేవాలయంలోకి అడుగు పెడితే, వారు ఏడు జీవితాల పాటు అంటే ఏడు జన్మల్లో వితంతువు జీవితాన్ని గడిపే శాపం తగులుతుందట. ఆ నమ్మకం కొనసాగు దేవాలయం బయట ఆడవారికి ప్రవేశం నిషేధమని బోర్డు కూడా ఉంటుంది.