గణేశ్ చతుర్థి ఆగస్టు 26ననా? లేక ఆగస్టు 27ననా? పూజ ముహూర్తం, తేదీ, సమయం వివరాలు..
పలు నగరాల్లో గణేశ్ చతుర్థి ముహూర్తం ఎలా ఉంది? గణేశ్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటాం?
- T Venkateshwarlu
- Published On : August 25, 2025 / 03:36 PM IST
Ganesh Chaturthi 2025
Ganesh Chaturthi 2025: దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్సాహంతో జరుపుకునే హిందూ పండుగ గణేశ్ చతుర్థి. విఘ్నాలను తొలగించే, జ్ఞానం, సంపద, శుభఫలాలను ప్రసాదించే దేవుడిగా గణేశుడిని ఆరాధిస్తారు. ఆయన ఆశీస్సులు పొందేందుకు ఈ పండుగ సందర్భంగా ప్రజలు గణనాథుడిని ప్రార్థిస్తారు.
ఈ పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ఖచ్చితమైన తేదీ, సమయంపై చాలా మందిలో ఇంకా సందేహాలు ఉన్నాయి. హిందూ పంచాంగం ప్రకారం చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు ముగుస్తుంది.
గణేశ్ చతుర్థి 2025.. తేదీ పూజ సమయం
దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణేశ్ చతుర్థి ఆగస్టు 27 బుధవారం జరగనుంది. మధ్యాహ్నం గణేశ పూజ ముహూర్తం ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు ఉంటుంది.
ఈ వేడుకలు 10 రోజుల తర్వాత ముగుస్తాయి. గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 6న ఉంటుంది. (Ganesh Chaturthi 2025)
పలు నగరాల్లో గణేశ్ చతుర్థి ముహూర్తం (ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు)
- హైదరాబాద్ – 11:02 నుంచి 01:33 వరకు
- పూణే – 11:21 నుంచి 01:51 వరకు
- న్యూఢిల్లీ – 11:05 నుంచి 01:40 వరకు
- చెన్నై – 10:56 నుంచి 01:25 వరకు
- జైపూర్ – 11:11 నుంచి 01:45 వరకు
- గురుగ్రామ్ – 11:06 నుంచి 01:40 వరకు
- చండీగఢ్ – 11:07 నుంచి 01:42 వరకు
- కోల్‌కతా – 10:22 నుంచి 12:54 వరకు
- ముంబై – 11:24 నుంచి 01:55 వరకు
- బెంగళూరు – 11:07 నుంచి 01:36 వరకు
- అహ్మదాబాద్ – 11:25 నుంచి 01:57 వరకు
- నోయిడా – 11:05 నుంచి 01:39 వరకు
గణేశ్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటాం?
ఒక పురాణ కథనం ప్రకారం.. గణేశుడిని పార్వతీదేవి పసుపు పేస్ట్‌తో ఒక బాలుడి రూపాన్ని సృష్టించి, దానికి ప్రాణం పోసింది. తాను స్నానం చేస్తున్న వేళ ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆ బాలుడిని ఆదేశించింది.
అయితే, శివుడు ఇంటికి వచ్చినప్పుడు, గణేశుడు అడ్డుకున్నాడు, దీంతో శివుడు కోపించి గణేశుడి తలను నరికివేశాడు. ఆ తరువాత పార్వతీ తిరిగి వచ్చి ఆవేదన వ్యక్తం చేసి గణేశుడిని తిరిగి బతికించాలని శివుణ్ని కోరింది. అప్పుడే శివుడు మొదట కనబడిన జీవి తలతో గణేశుడిని తిరిగి బతికించాడు. అదే ఏనుగు తల. అందుకే గణేశ్ చతుర్థిని జరుపుకుంటాం.
