Telangana Politics : తెలంగాణలో మరో బై ఎలక్షన్ తప్పదా? గెలిచేది ఎవరు? బీఆర్ఎస్ ఏమంటుంది..?
Telangana Politics : కాంగ్రెస్ అంతర్గత పోరు నుంచి జనం దృష్టిని మరల్చేందుకే కౌశిక్‌రెడ్డి ఇష్యూను మరోసారి తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Telangana Politics : ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో జరిగిన గొడవ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సీటుపై చర్చకు దారితీస్తోంది. కడియం శ్రీహరితో వాగ్వాదం, అనుచిత సైగలు చేశారన్న ఆరోపణలతో స్పీకర్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఎథిక్స్ కమిటీ లేకుండానే..కౌశిక్‌రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఫార్వర్డ్ చేయడమేంటంటూ బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తూ వచ్చింది. అయితే లేటెస్ట్గా ఏర్పాటైన ఎథిక్స్ కమిటీ..ఫస్ట్ టైమ్ ఈనెల 29న కౌశిక్‌రెడ్డి ఇష్యూపై భేటీ కానుంది.
Also Read : Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!
ఎథిక్స్ కమిటీ కౌశిక్‌రెడ్డి నుంచి వివరణ తీసుకుంటుందా.? మందలింపుతో సరిపెడుతుందా? లేక కఠిన చర్యలకు సిఫారసు చేస్తుందా.? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి సిఫారసు చేయడం ఒక దశ. దానిపై స్పీకర్, సభ నిర్ణయం తీసుకోవడమనేది సెకండ్ ఎపిసోడ్. కాబట్టి ఇప్పుడే కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి ఉంటుందో.? ఊడుతుందో.? చెప్పలేం. కానీ.. వేటు పడితే ఏంటన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఒకవేళ వేటు వేసే సిచ్యువేషన్ ఉంటే..కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా..లేదా ఏదైనా చట్టపరమైన ప్రక్రియ ద్వారా హుజూరాబాద్ స్థానం ఖాళీ అయినా..అక్కడ మరోసారి ఉప ఎన్నిక తప్పదన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. బీఆర్ఎస్ హయాంలో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు మరోసారి బైపోల్ వస్తే మాత్రం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాల పరీక్షగా మారే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఎథిక్స్ అస్త్రంపై బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది.
కాంగ్రెస్ అంతర్గత పోరు నుంచి జనం దృష్టిని మరల్చేందుకే కౌశిక్‌రెడ్డి ఇష్యూను మరోసారి తెరపైకి తెచ్చారంటున్నారు బీఆర్ఎస్. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా..ఓ వైపు అధికార పార్టీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్..ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యల దుమారం నడుస్తుంటే..కౌశిక్‌రెడ్డి అంశంపై ఎథిక్స్ కమిటీ భేటీ కావడం పక్కా అటెన్షన్ డైవర్షన్ గేమే అంటోంది కారు పార్టీ. అంతేకాదు సీఎం సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనను కూడా కమిటీ ముందు ప్రస్తావిస్తామంటోంది బీఆర్ఎస్. కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ కేవలం ఒక ఎమ్మెల్యే కేసుగా కాకుండా..రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్న చర్చ సాగుతోంది.
ఒకవేళ కౌశిక్‌రెడ్డిపై వేటు పడి..హుజూరాబాద్ ఉపఎన్నిక వస్తే..కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పుగా బీఆర్ఎస్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్కు కూడా తమ రాజకీయ బలం ఎంతో చూపించుకునే వేదికగా మారొచ్చు. ఎథిక్స్ కమిటీ దగ్గర మొదలైన వ్యవహారం..చివరికి హుజూరాబాద్ ఎన్నికల బరిలోకి వెళ్తుందా.? లేక అసెంబ్లీ హాల్ లోపలే సమసిపోతుందా అనేది సస్పెన్స్‌గా మారింది.
అసెంబ్లీలో కౌశిక్‌రెడ్డి దూకుడు. ప్రభుత్వంపై వరుస విమర్శలు..వివాదాస్పద వ్యాఖ్యలు..సస్పెన్షన్లతో ఆయన ఇప్పటికే పేరు పలుసార్లు వార్తల్లోకి నిలిచారు. 29న ఎథిక్స్ భేటీలో ఏం తేలనుంది.? ఈ ఎపిసోడ్ కౌశిక్‌రెడ్డికి రాజకీయంగా మైనస్ అవుతుందా.? బీఆర్ఎస్ ఆయనను మరింత ఫైటర్‌గా నిలబెడుతుందా.? అన్నది డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఇప్పటివరకు కౌశిక్‌రెడ్డి వర్సెస్ ఎథిక్స్ కమిటీ అన్నట్లుగా నడిచింది వ్యవహారం. కానీ ఈ నెల 29న జరిగే విచారణ తర్వాత ఈ కథ ఎటు మలుపు తిరుగుతుందన్నదే ఇప్పుడు కీలకం.
చర్యలు లేకపోతే..ఈ ఎపిసోడ్ అక్కడితో ముగిసినట్టే.స్ట్రిక్ట్ యాక్షన్‌కు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేస్తే మాత్రం..కొత్త పొలిటికల్ ఫైట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. వేటు వేస్తే ఎమ్మెల్యే పదవిపై ప్రభావం చూపే పరిస్థితి వస్తే..హుజూరాబాద్‌లో ఉపఎన్నిక రావొచ్చు. అప్పుడు హుజురాబాద్ మళ్లీ తెలంగాణ రాజకీయాల హాట్ టాపిక్‌గా మారుతుందా.? బీఆర్ఎస్ మళ్లీ ఆ సీటును నిలబెట్టుకుంటుందా.? కాంగ్రెస్ గులాబీ కోటలో పాగా వేస్తోందా.? ఎథిక్స్ కమిటీ విచారణతో కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందోనన్నది సస్పెన్స్‌గా మారింది.
