Ganja Seized
Hyderabad Ganja Seized : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అబ్దుల్ పూర్ మెట్ వద్ద ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.307 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి 21 వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, మత్తు పధార్థాలు, బంగారం, వెండి అభరణాలు, ఇతర వస్తువుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిబంధనావళి అమలులోకి రావడంతో పోలీసులు వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మద్యం, మత్తు పధార్థాలు, ఇతర వస్తువుల వివరాలను ఎన్నికలం సంఘం ప్రకటించింది. సుమారు రూ.106 కోట్లు నగదు, రూ.13 కోట్ల 59 లక్షల విలువైన 72,300 లీటర్ల మద్యం, రూ.15 కోట్ల 24 లక్షల విలువైన గంజాయి, రూ.145 కోట్ల 68 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.27 కోట్ల విలువైన ల్యాప్ టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, బియ్యం, క్రీడా సామాగ్రిని పట్టుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెలిపారు.