Uttar Pradesh: అజాం‭కు ఎన్‭కౌంటర్ భయం.. పోలీసు వాహనంలో కూర్చునేందుకు భయపడి తండ్రిని, సోదరుడిని పట్టుకుని ఏడ్చాడు

పొద్దున్నే జైలు నుంచి మార్చడంపై అనుమానాలు వచ్చాయి. అలాగే అజాం ఖాన్ కుటుంబం చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని వాపోతున్నారు. దీంతో పోలీసు వాహనంలో కూర్చోవడానికి అబ్దుల్లా ఆజాం నిరాకరించారు

Uttar Pradesh: అజాం‭కు ఎన్‭కౌంటర్ భయం.. పోలీసు వాహనంలో కూర్చునేందుకు భయపడి తండ్రిని, సోదరుడిని పట్టుకుని ఏడ్చాడు

Updated On : October 22, 2023 / 4:32 PM IST

Uttar Pradesh: జనన ధృవీకరణ పత్రాల కేసులో కోర్టు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించిన అనంతరం.. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ కుమారులు అదీబ్ అజాం, అబ్దుల్లా ఆజాంలను పోలీసులు వేరే జిల్లాకు తరలించారు. ఆదివారం ఆదీబ్ అజాంను సీతాపూర్‌కు, అబ్దుల్లా ఆజాంను హర్దోయి జైలుకు తరలించారు. రాంపూర్ జైలు నుంచి తరలించే ముందు వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

రాంపూర్ జైలు నుంచి భద్రత మధ్య ఐదు గంటల ప్రాంతంలో బయటకు తీసుకొచ్చి, కట్టుదిట్టమైన భద్రతతో ప్రత్యేక వాహనాల్లో సీతాపూర్‌, హర్దోయ్‌ జైలుకు తరలించారు. ఇద్దరు నేతలను అదనపు పోలీసు బలగాలతో పంపించారు. అయితే జైలుకు తరలించే క్రమంలో వారికి ఎన్‌కౌంటర్‌ భయం ఏర్పడింది. ముఖ్యంగా అహ్మద్ అజాం అయితే భయంతో వణికిపోయారు. పోలీసు వాహనం ఎక్కేందుకు భయడపడ్డారు.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: బందీలను హమాస్ ఇంత దారుణంగా చంపుతుందా?

పొద్దున్నే జైలు నుంచి మార్చడంపై అనుమానాలు వచ్చాయి. అలాగే అజాం ఖాన్ కుటుంబం చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని వాపోతున్నారు. దీంతో పోలీసు వాహనంలో కూర్చోవడానికి అబ్దుల్లా ఆజాం నిరాకరించారు. దీంతో ఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారులు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఇంతకు ముందు కూడా ఆజాం తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.

శనివారం తెల్లవారుజామున, పెద్ద కుమారుడు అదీబ్ ఆజాం రాంపూర్ జైలుకు చేరుకుని తండ్రి ఆజాం ఖాన్, తల్లి తజిన్ ఫాత్మా, సోదరుడు అబ్దుల్లా ఆజాంను కలిశారు. తల్లిని కౌగిలించుకున్నప్పుడు ఇద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన సమావేశంలో ఆయన పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు శిక్ష విధించిన తర్వాత ముగ్గురిని రాంపూర్ జిల్లా జైలులో ఉంచారు. ఆదివారం అదీబ్, అబ్దుల్లాలను సీతాపూర్, హర్దోయ్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‭లో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి పెద్ద షాక్ ఎదురైంది