Gas Booking : గ్యాస్ బుక్ చేస్తున్నారా..? అయితే, మీకు బిగ్‌అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి.. కొత్త రూల్స్ వచ్చాయ్!

Gas Booking : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

Gas Booking

  • గ్యాస్ బుకింగ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయ్!
  • గ్రామీణ ప్రాంతాల్లో 45రోజుల గడువు
  • పట్టణ ప్రాంతాల్లో 25రోజుల నిబంధన

Gas Booking : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఎఫెక్ట్ భారత దేశంపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్ కొరత వేదిస్తోంది. ఇప్పటికే గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. వంట గ్యాస్ సిలిండర్ రూ.60 పెంచగా.. కమర్షియల్ సిలిండర్ పై రూ.114.5 పెరిగిన విషయం తెలిసిందే. దీనికితోడు వంట గ్యాస్ కొరత కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Also Read : Rythu Bharosa Scheme : రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేది ఈ తేదీల్లోనే…

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇటీవల సిలిండర్‌కు సిలిండర్ కు మధ్య బుకింగ్ గడువును 21రోజుల నుంచి 25రోజులకు కేంద్రం పెంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తరువాత మరో సిలిండర్ బుకింగ్ గడువును 45రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పెద్ద కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో గతంలో 55 రోజులకోసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారు.. ఇటీవల 15రోజులకే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికే బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45రోజులకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దక్షిణాసియాలో జరుగుతున్న యుద్ధం శుభకార్యక్రమాలపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలైతే ఎన్నో వర్గాల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఎల్పీజీ కొరత రోజురోజుకు తీవ్రంగా మారుతుండటంతో కట్టెలకు కూడా డిమాండ్ పెరగడంతో పెళ్లిళ్లలకు వచ్చే అతిథులకు భోజనాలు పెట్టగలుగుతామా.. లేదా? అని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ బుకింగ్ దాదాపు పిలిపివేయడంతో వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడుతున్న విషయం తెలిసిందే. గ్యాస్ కొరత తీవ్రత రోజురోజుకు పెరగడంతో వివాహ శుభకార్యాలతోపాటు నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు ఇతర ఫంక్షన్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.