Gas Cylinder For 500 Rupees
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ వ్యాప్తంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి, లేదంటే సబ్సిడీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది.. ఇదీ రూ.500కే సిలిండర్ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న వదంతులు. వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ప్రభుత్వం. కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించింది లేదు.
అయితే వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. అయితే, ఇవన్నీ వదంతులేనని, ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం వినిపించుకోవడం లేదు. ఎక్కడ అవకాశం పోతుందో అనే ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
Also Read : గుప్తనిధుల పేరుతో 11 హత్యలు, పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్.. తీర్థంలో పాయిజన్ ఇచ్చి
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే.. కచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని, అది కూడా నెలాఖరు వరకే సమయం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వం అందించే 500 రూపాయల రాయితీ సిలిండర్ వర్తిస్తుందనే సమాచారం వైరల్ అయ్యింది. అది నిజమేనేమో అని నమ్మేసిన జనం గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీశారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు.
Also Read : అన్ని శాఖల్లోను అప్పులే.. అయినా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, అవన్నీ పుకార్లే అని ఉన్నతాధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తేల్చి చెప్పారు. కేవైసీకి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ జనాలు వినిపించుకోవడం లేదు. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.