Serial Killer : గుప్తనిధుల పేరుతో 11 హత్యలు, పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్.. తీర్థంలో పాయిజన్ ఇచ్చి
నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు చేసే వ్యవహారశైలి అతడిది అని చెప్పారు.

Serial Killer Arrest (Photo : Google)
గుప్త నిధుల పేరుతో ఆశ పెడతాడు. ఆ తర్వాత అడ్డంగా మోసం చేస్తాడు. అందినకాడికి దోచుకుంటాడు. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని చంపేస్తాడు. ఇలా ఏకంగా 11 మర్డర్లు చేశాడు. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు దొరికిపోయాడు.
నాగర్ కర్నూల్ పోలీసులు సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేశారు. గుప్త నిధుల పేరుతో 11 హత్యలు చేసిన సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ గత మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి డబ్బు తీసుకుని చంపేసిన కేసులో పోలీసులు విచారణ చేస్తుండగా.. ఈ సీరియల్ కిల్లర్ దారుణాలు బయటపడ్డాయి. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సత్యనారాయణ చేసిన దారుణాలు తెలుసుకుని పోలీసులే విస్తపోయారు. సీరియల్ కిల్లర్ నుంచి పాయిజన్ బాటిల్స్, మృతుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : కదులుతున్న కారులో ప్రభుత్వ అధికారి కూతురుపై లైంగిక దాడి.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అఘాయిత్యం
ఈ కేసుకు సంబంధించిన వివరాలను జోగులాంబ రేంజ్ డీఐజీ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. 11 మంది అమాయకులను హతమార్చిన తాంత్రికుడు సత్యనారాయణను అరెస్ట్ చేశామన్నారు. సీరియల్ కిల్లర్ సత్యనారాయణ తన తాతల నుంచి మూలికా వైద్యం నేర్చుకున్నాడని తెలిపారు. గుప్త నిధులు వెలికితీస్తానని జనాలను నమ్మించి మోసం చేయడం నిందితుడి ప్రవృత్తి అన్నారు. ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో దర్యాప్తు చేస్తే మిగతా అంశాలు బయటకు వచ్చాయన్నారు. తీర్థం రూపంలో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తాడని పోలీసులు వెల్లడించారు. గుప్త నిధులపై అమాయకులకు ఉన్న ఆశని తన ఎరగా మార్చుకున్నాడు సత్యనారాయణ.
నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు చేసే వ్యవహారశైలి అతడిది అని చెప్పారు. సత్యనారాయణ ఒక వ్యక్తి నుంచి 9లక్షలు, ఇంకొంత మంది దగ్గర ప్లాట్, ల్యాండ్ తీసుకున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ఇక, గుప్త నిధుల పేరుతో కర్ణాటకలో మూడున్నర ఎకరాల ల్యాండ్ పొందినట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. గుప్త నిధుల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : 18 ఏళ్ల వయసు భార్యతో శృంగారం నేరం కాదు…అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు