Corona Control Room : జీహెచ్‌ఎంసీ కరోనా కంట్రోల్‌ రూం నిర్లక్ష్యం..బాధితుల ఫోన్‌కాల్స్‌కు స్పందించని సిబ్బంది

కరోనా కేసుల్లో హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. అయినా జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్‌రూంకు చీమ కుట్టినట్టయినా లేదు.

GHMC Corona Control Room Neglect : కరోనా కేసుల్లో హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. రోజురోజుకీ కేసులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్‌రూంకు చీమ కుట్టినట్టయినా లేదు. అత్యవసర సేవలందించాల్సిన కంట్రోల్ రూమ్ ఖాళీగా దర్శనమిస్తోంది.

కరోనా రోగులు ఫోన్‌ చేస్తే పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు పనిచేయాలి. కానీ డ్యూటీలో ఒకరే ఉంటున్నారు. సెలవురోజుల్లో ఆ ఒక్కరు కూడా కనిపించడం లేదు.

మందుల విషయంలో తక్షణ సలహాలు, సూచనలు పొందాలనుకుంటున్న నగరవాసులు…కంట్రోల్ రూమ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంట్రోల్ రూంకి ప్రత్యేక అధికారిణిగా నియమితులైన అనూరాధ అనారోగ్యంబారిన పడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు