Hyderabad : ‘ఎవరినో కుక్క కరిస్తే..నేనే ఆ కుక్కను కరవమన్నట్లుగా మాట్లాడుతున్నారు’ : GHMC మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

‘ఎవరినో కుక్క కరిస్తే..నేనే ఆ కుక్కను కరవమన్నట్లుగా మాట్లాడుతున్నారు’ అంటూ అంబర్ పేటలో బాలుడ్ని కుక్క కరిచిన ఘటనపై GHMC మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Hyderabad : అంబర్ పేటలో కుక్క కరిచి ఓ బాలుడు చనిపోయిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినో కుక్క కరిస్తే నేనే కరవమన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు మేయర్ విజయలక్ష్మి. మహిళలు బయటకు వస్తే సహించలేని వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలే చేస్తారని..రాజకీయాల్లో మహిళలు ఎదుగుతుంటే ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు, ఏదైనా సాధిస్తే ఓర్వలేరు, రాజకీయాల్లో ఎదుగుతుంటే ఓర్వలేరు..అటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని అన్నారు. అంబర్ పేటలో ఎవరినో కుక్క కరిస్తే ఆకుక్కను నేనే కరవమన్నట్లుగా వ్యాఖ్యలు చేశారని కావాలనే నాపై బురద జల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా..కొన్ని రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకరగ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా మరోసారి మాట్లాడు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినో ఉద్ధేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఆమె వివాదస్పంగా వ్యాఖ్యానించారు.

అభం శుభం తెలియని నాలుగేళ్ల ప్రదీప్ అనే బాలుడుని పొట్టనపెట్టుకున్న ఘటనపై నగర మేయర్ విజయలక్ష్మీ స్పందిస్తూ వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈక్రమంలో మరోసారి ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేశారు. అలానే రాజకీయల్లో ఉంటే ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయో…వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

కొంతమంది రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి చెడుగా కామెంట్స్ చేస్తుంటారు. అది కొందరిలో ఓర్వలేని తనమో, ఇకేమో కానీ.. చెడుగా కామెంట్స్ చేస్తుంటారని వ్యాఖ్యానిస్తూ మేయర్ అంబర్ పేట ఘటనను గుర్తు చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. నగర మేయర్ అంటే ఎన్నో బాధ్యతలుంటాయి. ఎన్నో ఒత్తిడులు ఉంటాయని చెబుతూనే అంబర్ పేట కుక్క సంఘటన గురించి మీ అందరికి తెలుసు..ఆ కుక్క ఎవరినో కరిస్తే.. నేనే కరవమన్నట్లు కొందరు మాట్లాడారు అంటూ వ్యాఖ్యానించారు.



ట్రెండింగ్ వార్తలు