NIZAM GOlD COIN : 12 కిలోల ‘నిజాం బంగారు నాణెం’ 40 ఏళ్ల మిస్టరీ వీడేనా?..ఆచూకీ లభించేనా..?

అది ప్రపంచంలోనే అత్యంత బంగారు నాణెం. బరువు 12 కిలోలు. నిజాంకు చెందిన ఈ బంగారునాణెం ఎక్కడుందో..ఎవరి వద్ద ఉందో..అనేది 40 ఏళ్లుగా మిస్టరీ కొనసాగుతోంది. ఈ మిస్టరీని ఛేదించి ఈ బంగారు నాణాన్ని భారత్ కు తెప్పించటానికి ప్రధాని మోడీ ప్రభుత్వం యత్నాలు చేస్తోంది.

world largest 12 kg nizam gold coin : నిజాం అనగానే హైదరాబాద్ సంస్థానం ఎలా గుర్తుకు వస్తోందో.. ఆయన ఆస్తిపాస్తులు కూడా అంత స్పీడ్‌గా గుర్తుకువస్తాయి. ప్రపంచంలోకెల్లా ధనవంతుడంటూ 1937 పిబ్రవరి 22 టైమ్​ మ్యాగజైన్​ కవర్​ పేజీపై నిజాం ఫోటో వేశారు. వరల్డ్‌లోనే గొప్ప వజ్రాల్లో ఒకటిగా పేరుపడ్డ జాకబ్​ డైమండ్​ను పేపర్​ వెయిట్​గా నిజాం వాడుకునేవారని చెబుతారు. దీన్ని బట్టి ఆయన ఎంతటి ధనవంతుడో అర్థం చేసుకోవచ్చు. 1940 ప్రాంతాల్లోనే ఆయన ఆస్తుల విలువ 14 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11 లక్షల 80 వేల కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. 2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా లెక్క తేల్చారు.

ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని 218 కోట్లకు కొనుగోలు చేసింది. 1967లో ఉస్మాన్‌ అలీఖాన్‌ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

Also read : NIZAM gold coin : ప్రపంచంలోనే అతిపెద్ద ‘నిజాం గోల్డ్ కాయిన్’ ఆచూకీ కోసం మోడీ సర్కార్ యత్నాలు

173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, ఆర్మ్‌ బ్యాండ్‌లు, కంకణాలు, గంటలు, బటన్‌లు, కఫ్‌ లింక్‌లు, చీలమండలు, వాచ్‌ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాల లాంటి నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు. 184.75 క్యారెట్ల బరువున్న జాకబ్‌ డైమండ్‌ కూడా నిజాం సంపదలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది.

తమ ఆభరణాలెన్నో నిజాంకే తెలియదు. ఆయన దగ్గర ఉన్న ముత్యాలెన్నో కొలతకు అందవు. బంగారం నిల్వ చేయడానికి ఇనప్పెట్టెలు చాలేవి కాదు. 150 మంది ఒకేసారి భోజనం చేయడానికి కావలసిన పాత్రలు.. అంతా బంగారంతో తయారు చేసినవే. 1963లో కేంద్ర ప్రభుత్వం బంగారం మీద నియంత్రణ విధించింది. ఆ సమయంలో నిజాం వారసుడు ముకరంజా.. తన దగ్గరే 22 టన్నుల బంగారం ఉందని ప్రకటించాడు. ఒక సమయంలో కింగ్‌ ‌కోఠి భవనంపై ముత్యాలన్నీ పరిస్తే.. మొత్తం నిండిపోయిందని చెబుతారు. ఇవన్నీ చరిత్రకారులు ‌రాసిన విషయాలు.

also read : Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

ఆఖరి నిజాం వద్ద ఆభరణాల గుట్టలే ఉండేవి. అవన్నీ మొగలులు, కాకతీయులు, విజయనగర పాలకులు, ఖాందేష్‌, అహ్మద్‌ ‌షాహి, నిజాం షాహి, బరీద్‌ ‌షాహి, కుతుబ్‌ ‌షాహీ పాలకుల నుంచి వచ్చినవే. ఆఖరి నిజాం 1911లో అధికారంలోకి వచ్చిన నాటికి జాకబ్‌ ‌వజ్రం సహా ఎన్నో విలువైన ఆభరణాలు, నవరత్నాలు ఉండేవి. వీటి రక్షణకు మూడు ట్రస్ట్‌లు ఏర్పాటు చేశారు. మొదట కింగ్‌కోఠిలోని రాజ ప్రాసాదంలోనే ఉంచినా తరువాత బొంబాయిలోని మెర్కంటయిల్‌ ‌బ్యాంక్‌లో దాచారు. తాను మరణించిన తర్వాత అందులో రెండు ట్రస్ట్‌లలోని ఆభరణాల్ని కుటుంబ సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలని వీలునామా రాశాడు. 1965 నాటి పాక్‌ ‌యుద్ధ సమయంలో నిజాం కేంద్ర ప్రభుత్వానికి 33వేల బంగారు నాణాలు ఇచ్చాడంటేనే ఆయన సంపద ఎంతో అర్ధమవుతుంది.

నిజాం ఆస్తులంటే వజ్ర, వైఢూర్యాలు.. బంగారు ఆభరణాలే కాదు. లెక్కలేనన్ని భవనాలు.. వేల ఎకరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. తరగని సంపద ఆయన సొంతం. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 23వేల ఎకరాల భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, మహాబలేశ్వరంలో ఉన్న 630 భవనాలు, భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి సీఎస్‌ వెంకటాచారి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్‌విల్లా, ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్‌ ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర, వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమైయ్యాయి. అయితే ఈస్తుల పరిరక్షణకు ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి.. అందులో ప్రభుత్వ ప్రతినిధులు సైతం సభ్యులుగా చేర్చింది. దీంతో ది నిజామ్స్‌ ట్రస్ట్‌ డీడ్స్‌ యాక్ట్‌ పేరుతో 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా, సభ్యులుగా నిజాం కుటుంబ సభ్యులతో పాటు మాజీ సివిల్‌ సర్వీసు అధికారులు వ్యవహరిస్తున్నారు.

also read : వావ్..ఏమి అందం : పింక్ డైమండ్ ధర రూ. 198 కోట్లు..!!

లక్షల కోట్ల సంపద వున్న నిజాంకు 12 కేజీల గోల్డ్‌ కాయిన్‌ పెద్ద విలువైంది కాకపోవచ్చు. కానీ.. అది భారత వారసత్వ సంపద. మన దేశ సిరిని ప్రపంచానికి చాటిన నాణెం. అందుకే దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కేంద్రప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ప్రయత్నం వర్కవుట్‌ అవుతుందో, లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు