Hyderabad : విదేశాలకు వెళ్లలేకపోతున్నా… మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఓ యువతి విదేశాలకు వెళ్లాలని పరీక్ష రాసింది. ఆ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.

Hyderabad :  ఓ యువతి విదేశాలకు వెళ్లాలని పరీక్ష రాసింది. ఆ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వీలుంటే ఖమ్మం జిల్లా నెలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలిసి అమీన్ పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది. క్లినికల్ అనాలసిస్ట్ గా పనిచేసే ఆమె కరోనా సమయంలో ఇంటినుంచి విధులు నిర్వహించారు.

Read More : Suicide Letter : ఏ ఆడపిల్లా నా అత్తింటి మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు..

ఆ పని చేసుకుంటూనే విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం మూడు సార్లు పరీక్ష రాసింది. మూడు సార్లు క్లాలిఫై కాలేకపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఇదే విషయం తన సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే బుధవారం సింధు తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. బెడ్డుపై నురగలు కక్కుతూ ఉన్న సింధును గమనించిన ఆమె సోదరుడు తేజ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అప్పటికే సింధు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్‌పూర్‌ పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు